Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి.. తల్లి వద్దకు చేర్చిన పోలీసులు..!

మతిస్థిమితం కోల్పోయిన తల్లి వద్ద నుంచి అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారిని మిర్యాలగూడ పోలీసులు తల్లి వద్దకు చేర్చారు.

Miryalaguda : అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి.. తల్లి వద్దకు చేర్చిన పోలీసులు..!

మిర్యాలగూడ, మనసాక్షి :

మతిస్థిమితం కోల్పోయిన తల్లి వద్ద నుంచి అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారిని మిర్యాలగూడ పోలీసులు తల్లి వద్దకు చేర్చారు. మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ నగర్ తండాకు చెందిన దివ్య కు ఒక కుమారుడు, ఒక కుమార్తె లక్ష్మి (ఏడు సంవత్సరాలు) కలరు. రెండు సంవత్సరాల క్రితం దివ్య భర్త చనిపోవడంతో ఆమె మానసికంగా ఇబ్బంది పడి మతిస్థిమితం లేకపోవడం వలన పిల్లల ఆలనా పాలన చూసుకోవడం ఇబ్బంది ఏర్పడింది. దాంతో పిల్లల సంరక్షణ బాధ్యతను దివ్య తల్లి దుర్గ తీసుకున్నారు.

అయితే దివ్య కొన్నిసార్లు ఎవరికి చెప్పకుండా తన తల్లి వద్ద నుండి కుమార్తె లక్ష్మిని తీసుకొని వెళ్లి మానసిక అస్థిర స్థితిలో తిరుగుతూ తర్వాత ఇంటికి తిరిగి వస్తుండేది. ఈ క్రమంలో ఏప్రిల్ 25వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో దివ్య తన ఏడేళ్ల కుమార్తెను తీసుకొని బయటికి వెళ్ళింది. తిరిగి ఆదివారం సాయంత్రం దివ్య ఒంటరిగా ఇంటికి రావడంతో లక్ష్మి గురించి తల్లిని అడగగా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

దాంతో కుటుంబ సభ్యులు వివిధ ప్రదేశాలలో వెతికినా ఎక్కడ కనిపించలేదు. కాగా ఏప్రిల్ 27వ తేదీన దుర్గ మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏడేళ్ల చిన్నారి లక్ష్మీ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కాగా పోలీసులు చిన్నారిని ఆచూకీ తెలుసుకొనేందుకు వివిధ ప్రదేశాలలో పోస్టర్లు అతికించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు.

గత పది రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసి l చివరి ప్రయత్నం గా మిర్యాలగూడ పోలీసు వారు డిఎస్పి రాజశేఖర్ రెడ్డి రాజు, సిఐ లు నాగభూషణం, సోమ నరసయ్య, ఎస్సై సైదిరెడ్డిలు 30 భాగాలుగా విభజించి తీవ్రమైన గాలింపు చేపట్టారు. అయితే పది రోజులుగా పాపకు ఆశ్రయమిస్తున్న ఒక మహిళ తెలుసుకొని మంగళవారం అట్టి పాపను పోలీసులకు అప్పగించింది. దాంతో ఆ పోలీసులు తల్లి మరియు అమ్మమ్మ సమక్షంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించడం జరిగింది . కాగా పాప ఆచూకీ కనుగొనే విషయంలో సహకరించిన వారందరికీ డి.ఎస్.పి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు