Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : హైడ్రాను విస్తరించేందుకు నిర్ణయం.. మిర్యాలగూడలో హైడ్రా కమిషనర్ పర్యటన..!

హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా కావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు.

Miryalaguda : హైడ్రాను విస్తరించేందుకు నిర్ణయం.. మిర్యాలగూడలో హైడ్రా కమిషనర్ పర్యటన..!

మిర్యాలగూడ, మన సాక్షి:

హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా కావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన పర్యటించారు. అనంతరం ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. కబ్జాలపై వేలాదిగా వినతి పత్రాలు వస్తున్నాయని, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకుగాను నాలుగు వారాలపాటు ప్రజావాణిని రద్దు చేశామని చెప్పారు. హైడ్రాక్ వ్యతిరేకంగా కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్నారని, కానీ కబ్జాల నుంచి సుమారుగా 85 వేల కోట్ల విలువైన భూములను కాపాడినట్లు ఆయన వెల్లడించారు. మరో ఏడాది లో లక్ష కోట్ల విలువ చేసే భూములను తాము కాపాడుతామని పేర్కొన్నారు. హైడ్రా పరిధి లోనే 10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి : 

మరిన్ని వార్తలు