Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
జన్వాడలో విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి..!
Tragedy in Janwada: Three-Year-Old Child Dies After Falling into Water Sump!

జన్వాడలో విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల చిన్నారి ప్రియాన్షు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఆదివారం ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.









