Nalgonda : యుద్దప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి..!
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలలో ప్రాతిపదికన కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు.

Nalgonda : యుద్దప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి..!
తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా తూకం వేయాలి
కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిగాపులు
సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
సిపిఐఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా
నల్గొండ, మన సాక్షి :
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలలో ప్రాతిపదికన కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లా మంత్రులు రబీ సీజన్ ధాన్య సేకరణ పై ఇంతవరకు సమీక్ష జరుపకపోవడం దారుణం అన్నారు. ఇకనైనా జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించి 15 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతాంగాన్ని సమీకరించి ఎక్కడికక్కడ నిర్బంధిస్తామని హెచ్చరించారు.
జిల్లాలో 459 కొనుగోలు కేంద్రాలలో సుమారు 6 లక్షల 50 వేలకు పైగా మెట్రిక్ టన్నుల దాన్యమును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు సగం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యము తీసుకవచ్చిన రైతులు రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారని వచ్చిన దాన్యమును వెంటవెంటనే కొనుగోలు చేయకపోవడంతో ఆకాల వర్షాలు కురవడంతో ధాన్యం తడుస్తుందన్నారు. కేంద్రాలలో అవసరమైన టార్బాన్లుకూడా అందుబాటులో పెట్టకుండా రైతులకు మంచినీరు వసతి కూడా కల్పించడం లేదన్నారు. ప్రతి రోజు రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా పార్టీ ప్రతినిధిబృందాలు సర్వే చేసిన కొనుగోలు కేంద్రాలలో తాలు, తేమ పేరుతో తరుగు కలిపి 40 కిలోల బస్తాకు అదనంగా 2నుండి 10కిలోలు తూకం వేస్తున్నారని, అన్ని కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన దాన్యమును వెంటవెంటనే లారీలను పంపి ఎత్తించడం లేదని తెలిపారు. లారీలు మిల్లుల వద్ద రోజుల తరబడి దిగుమతి చేయకపోవడంతో లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపడం లేదన్నారు. మిల్లుల వద్ద వెయిటింగ్ ఉన్నందుకు రైతుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నారని, కొన్ని కేంద్రాలలో గన్నీ బ్యాగులు కొరత ఉన్నదన్నారు. ట్రక్కు షీట్లు ఇచ్చే దగ్గర కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ కొన్ని కేంద్రాలలో రైతుల వద్ద డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
తాలు, తరుగు పేరుతో బస్తా దాన్యమునకు అదనపు తూకంను వేయరాదన్నారు.తూకం వేసిన వెంటనే రైతులకు ట్రక్కు షీట్ ఇవ్వాలి. ట్రక్కు షీట్ ఇచ్చి 2, 3 రోజులలో రైతులకు డబ్బు జమ చేయాలని డిమాండ్ చేశారు.కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీలను పంపి వేగంగా కొనుగోలు చేసి మిల్లుల వద్ద కూడా వెంటవెంటనే దిగుమతి చేయాలన్నారు. మిల్లుల వద్ద దిగుమతి చేయని పక్షంలో ప్రత్యేకంగా ప్రయివేట్ గోదామ్లను లీజుకు తీసుకొని దిగుమతి చేయాలని తెలిపారు.
మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన దాన్యమును ‘దిగుమతి చేయకుండా మిల్లర్లు కొనుగోలు చేసిన దాన్యమును దిగుమతి చేసుకుంటున్నారని అన్నారు.
ఆకాల వర్షాలతో కొనుగోలు కేంద్రంలో తడిసిన దాన్యమును కూడా కటింగ్ లేకుండా తూకం వేసి,జిల్లా అధికారులు రెగ్యులర్గా పర్యవేక్షణ చేసి యుద్దప్రాతిపదికన కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం అన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సి పి ఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారీ ఐలయ్య, పాలడుగు నాగార్జున, డబ్బికార్ మల్లేష్, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, వి వెంకటేశ్వర్లు, పి నర్సిరెడ్డి, గంజి మురళి, మల్లం మహేష్, దండెంపల్లి సత్తయ్య, కంబాలపల్లి ఆనంద్, బొజ్జ చిన్న వెంకులు, రాచకొండ వెంకన్న, పెంజర్ల సైదులు, పీ వరలక్ష్మి, అవిశెట్టి శంకర్, జిట్ట నగేష్, సరోజ, కొండ అనురాధ, ఉడుగుండ్ల రాములు, కొండేటి శ్రీనివాస్, రొండి శ్రీనివాస్, నన్నూరి వెంకటరమణారెడ్డి, డి రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, చేగోని సీతారాములు, రాజు, వెంకన్న, రవి, మల్లు గౌతంరెడ్డి, మన్నెం బిక్షం తదితరులు పాల్గొన్నారు.










