Breaking Newsతెలంగాణహైదరాబాద్
TS News : బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మార్చిన ప్రభుత్వం..!
బక్రీద్ పండుగ సెలవు దినాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చింది. 2026 మే 27 (బుధవారం) బక్రీద్ పండుగ సెలవు ఇవ్వాల్సిన ప్రభుత్వం 2026 మే 28 (గురువారం) కి మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

TS News : బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మార్చిన ప్రభుత్వం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
బక్రీద్ పండుగ సెలవు దినాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చింది. 2026 మే 27 (బుధవారం) బక్రీద్ పండుగ సెలవు ఇవ్వాల్సిన ప్రభుత్వం 2026 మే 28 (గురువారం) కి మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వక్ఫ్ బోర్డు, మైనార్టీ సంక్షేమ శాఖల విజ్ఞప్తుల మేరకు ఈ మార్పు చేసింది.
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం మే 28న సాధారణ సెలవుదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ మార్పు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు, బ్యాకులకు వర్తిస్తుంది.









