Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Nalgonda : త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీద్..!

గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పట్టణంలో మునుగోడు రోడ్ లో ఉన్న ఈద్గా లోముస్లింల ప్రార్థన అనంతరం వారిని కలిసిబక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Nalgonda : త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీద్..!

రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నల్లగొండ, మన సాక్షి :

గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పట్టణంలో మునుగోడు రోడ్ లో ఉన్న ఈద్గా లోముస్లింల ప్రార్థన అనంతరం వారిని కలిసిబక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగం, విశ్వాసం, మానవతా విలువలను స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్ పండుగ సమాజానికి ఐక్యత, సహనం, పరస్పర ప్రేమాభిమానాల సందేశాన్ని అందిస్తుందని మంత్రి అన్నారు.బక్రీద్ పవిత్ర పండుగ అని,బక్రీద్ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవించడం రాష్ట్ర ప్రత్యేకత అని, ఆ స్ఫూర్తి మరింత బలపడాలని మంత్రి ఆకాంక్షించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించామని, విద్య మరియు ఉపాధి రంగాలలో అవకాశాలు అందించామని తెలిపారు. ముస్లింల కోసం పట్టణ ప్రాంతాల్లో షాదీఖానాల నిర్మాణం చేపడతామని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా అవకాశాలు కల్పించామని తెలిపారు.

నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా ఎలాంటి మత ఘర్షణలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సోదరభావంతో జీవిస్తున్నారని అన్నారు. ముస్లింల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని, ప్రజా ప్రభుత్వం అందరికీ సంక్షేమాన్ని అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా జీవించాలని ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ త్యాగం మరియు సేవా మార్గాన్ని గుర్తు చేసే పండుగ బక్రీద్ అని అన్నారు. ముస్లిం ల కు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ
జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్. వై .అశోక్ రెడ్డి ,ఏఎస్పి రమేష్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ,స్థానిక కార్పొరేటర్ మామిడి కార్తీక్,
తదితరులు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు