జిల్లా వార్తలుBreaking Newsక్రీడలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ముగిసిన సమ్మర్ క్యాంప్..!
మిర్యాలగూడ పట్టణంలోని 17 వార్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూకల చారిటబుల్ ట్రస్ట్, బీ ఎల్ ఆర్, ఎన్ వి ఆర్ వారు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ శనివారం ముగిసింది.

Miryalaguda : మిర్యాలగూడలో ముగిసిన సమ్మర్ క్యాంప్..!
మిర్యాలగూడ, మనసాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని 17 వార్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూకల చారిటబుల్ ట్రస్ట్, బీ ఎల్ ఆర్, ఎన్ వి ఆర్ వారు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ శనివారం ముగిసింది. క్రీడాకారుల ఆటపాటలతో అట్టహాసంగా ముగింపు కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా ఉచితంగా నెలరోజులపాటు రోజుకి 5000 రూపాయల ఆహారం ఇస్తూ అదే విధంగా 200 మందికి టీషర్ట్స్ పంచడం జరిగిందన్నారు. క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇచ్చినటువంటి కోచ్ లను సన్మానించడం జరిగింది.









