Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే BLR కీలక ఆదేశం.. అభివృద్ది పనులు వేగవంతం చేయాలి..!
మిర్యాలగూడ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే BLR కీలక ఆదేశం.. అభివృద్ది పనులు వేగవంతం చేయాలి..!
మిర్యాలగూడ, మనసాక్షి :
మిర్యాలగూడ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం పబ్లిక్ హెల్త్ విభాగం ఉన్నతాధికారులతో కలిసి ఆయన పట్టణంలో శరవేగంగా జరుగుతున్న చిన్న చెరువు కట్ట ఆధునీకరణ పనులను, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రతి పనిని నిశితంగా పరిశీలించి, పలు కీలక సూచనలు చేశారు. చిన్న చెరువు కట్ట నిర్మాణ పనులను పరిశీలించి, వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని కట్టను మరింత బలంగా నిర్మించాలని ఆదేశించారు.
కట్టపై ప్రజల కోసం వాకింగ్ ట్రాక్, లైటింగ్, పచ్చదనం పెంపొందించే పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నిరూపయోగంగా ఉన్న ఎస్టీపీ ప్లాంట్ సామర్థ్యం, మురుగునీటి శుద్ధి ప్రక్రియ సాంకేతికతను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదని కాంట్రాక్టర్లను, అధికారులను హెచ్చరించారు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లకుండా పబ్లిక్ హెల్త్ అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని సూచించారు.
నిర్దేశిత కాలపరిమితిలోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలకృష్ణ , కౌన్సిలర్ శ్రీజ, కాంగ్రెస్ నాయకులు బంటు లక్ష్మీ నారాయణ, మేడ మహేందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










