Miryalaguda : మానవహక్కుల గొంతుక మూగ పోయింది.. సుబ్బారావుకు సార్ కు ప్రముఖుల నివాళులు..!
మానవహక్కుల గొంతుక మూగ పోయింది.. ప్రజాస్వామిక గొంతుక పొన్నూరు సుబ్బారావు 92 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ స్థానిక జ్యోతి హాస్పిటల్ లో గురువారం ఉదయం అమరులయ్యారు.

Miryalaguda : మానవహక్కుల గొంతుక మూగ పోయింది.. సుబ్బారావుకు సార్ కు ప్రముఖుల నివాళులు..!
మిర్యాలగూడ, మనసాక్షి :
మానవహక్కుల గొంతుక మూగ పోయింది.. ప్రజాస్వామిక గొంతుక పొన్నూరు సుబ్బారావు 92 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ స్థానిక జ్యోతి హాస్పిటల్ లో గురువారం ఉదయం అమరులయ్యారు. సుబ్బారావుకు సార్ కు ప్రముఖుల నివాళులు అర్పించారు. త్రిపురాంతకం, కిష్టయమ్మ తల్లిదండ్రులకు పొన్నూరు సుబ్బారావు గారు జూలై 1, 1934 లో అమరావతిలో జన్మించారు.
విద్యాభ్యాసం అనంతరం ఆగస్టు 14,1956
మిర్యాలగూడ గౌట్ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా నియామకమై, 1971లో ఇంగ్లీషు లెక్చరర్ గా ప్రమోషన్ పొంది, 1982లో లెక్చరర్ గా స్వచ్ఛంద పదవి విరమణ పొందారు.
అనంతరం చైతన్య పాఠశాల ద్వారా అనేకమంది విద్యార్థులకు ఆంగ్ల ఉపాధ్యాయునిగా సుపరిచితమైన, ప్రజాస్వామిక వాది, భౌతిక హేతువాద దృక్పథంతో మార్క్సిస్టు భావజాలంతో మిర్యాలగూడ ప్రాంత ప్రజాస్వామిక ఉద్యమంలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించిన హక్కులనేత పొన్నూరు సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ పోరాకుల సంఘం జిల్లా నాయకులుగా, అనంతరం 2005 నుండి మానవ హక్కుల పోరాటంలో కొనసాగుతున్నారు.
మిర్యాలగూడ ప్రాంతంలో శేషు ,సుదర్శన్ , ఇతర ప్రజా స్వామిక వాదులతో చైతన్య సమాఖ్యను స్థాపించి, మిర్యాలగూడలో అనేక సామాజిక ఉద్యమాలకు పునాదులు వేశారు. అజమ్ అలీ, బాలగోపాల్ ల సారధ్యంలో రెండున్నర దశాబ్దాలుగా పౌర హక్కుల మానవ హక్కుల వేదికలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రజల పక్షాన హక్కుల గొంతుకగా నిలబడి కలబడినవాడు.
ఇవాళ సమాజంలో రాజ్యాంగ విరుద్ధంగా పేట్రేగిపోతున్న ఆశాస్త్రీయ విలువలకు, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా తన గొంతును వినిపించారు.
మానవ సమాజంలో మనుషుల మధ్య విచ్ఛిన్నకరమైన మత విద్వేషాలను, సోషలిస్టు వ్యతిరేక భావజాలాన్ని,
తన ప్రసంగాల ద్వారా సదస్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ, రాజ్యాంగ లక్ష్యాలైన స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం సాధన కోసం తన జీవితమంతా పోరాడిన ప్రజాస్వామిక గొంతుక పొన్నూరు సుబ్బారావు 92 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ స్థానిక జ్యోతి హాస్పిటల్ లో ఈరోజు ఉదయం అమరులయ్యారు.
ప్రముఖ కవి వరవరరావు, ప్రజాకవి గోరేటి వెంకన్న, మానవ హక్కుల నేత జీవన్శాకుమార్ , శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, వేముల వీరేశం విప్, మాజీ ఎమ్మెల్యే భాస్కర రావు, తిప్పన విజయ సింహారెడ్డి,
మున్సిపల్ చైర్మన్ చిలుకూరు సుధా బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రాజు డాక్టర్ మువ్వ రామారావు, మానవ హక్కుల వేదిక గురవయ్య, మోహన్, విద్యావత్తుల వేదిక, అంబటి నాగయ్య, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, మరో గ్రంథాలయ ఉద్యమ నేత కస్తూరి ప్రభాకర్, ప్రజా సంఘాల జేఏసీ రామయ్య, టీపీఎఫ్ సుధాకర్ రెడ్డి, గిరిజన ఉపాధ్యాయ సంఘ నేత మాలోతు దశరధ నాయక్, సుబ్బారావు కుమారులు, రమేష్ అజయ్, కిరణ్మయి, నీరజ, నజీర్ ఉదయ, తదితరులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
రేపు ఉదయం 8 గంటలకు నార్కట్‌పల్లి లోని కామినేని వైద్యశాలకు ఆయన ఆయన దేహాన్ని అప్పగించడం జరుగు తుందని, అప్పటివరకు మిర్యాలగూడ శాంతినగర్ నగర్ లోని ఆయన స్వగృహం లో పార్థివ దేహాన్ని సందర్శకుల కోసం ఉంచాం..












