Breaking Newsజాతీయం
LPG : మరోసారి పెరిగిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర..!
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా మరోసారి పెరిగింది. సిలిండర్ ధరను 29 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

LPG : మరోసారి పెరిగిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా మరోసారి పెరిగింది. సిలిండర్ ధరను 29 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే గృహ వినియోగ సిలిండర్ ధర పెరగటం రెండవసారి. పెరిగిన సిలిండర్ ధర ప్రకారం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పిజి గృహ వినియోగ సిలిండర్ ధర 913 రూపాయలు ఉండగా పెరిగిన ధర ప్రకారం 942 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి (జూన్ ఏడవ తేదీ నుంచి) అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలోనే గృహ వినియోగ ఎల్పిజీ సిలిండర్ ధర పెరిగినట్లు తెలుస్తోంది. మార్చి ఏడవ తేదీన గృహ వినియోగ సిలిండర్ ధర 60 రూపాయలు పెంచగా ప్రస్తుతం 29 రూపాయలు పెంచారు.
ఇవి కూడా చదవండి :
- District Collector : వైద్యం సక్రమంగా అందుతుందా..? మందులు అందిస్తున్నారా.? ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్..!
- ఎరువుల దుకాణాలలో విజిలెన్స్, ఎన్ఫోరసెమెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..!
- TS News : తెలంగాణలో ఉపసర్పంచ్ లకు షాక్.. చెక్ పవర్ రద్దుకు సర్కార్ నిర్ణయం..!
- మృగశిర కార్తెలో ఏ పంటలు సాగు చేయాలి.. ఏవి సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందంటే..!









