Karimnagar : ఆర్మీ ఉద్యోగాలకు ఢిల్లీ డిఫెన్సీ విద్యార్థులు ఎంపిక..!
కరీంనగర్ రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి చెందిన 193 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని ఆ అకాడమీ చైర్మన్ కొత్త సతీశ్ రెడ్డి తెలిపారు.

Karimnagar : ఆర్మీ ఉద్యోగాలకు ఢిల్లీ డిఫెన్సీ విద్యార్థులు ఎంపిక..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి చెందిన 193 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని ఆ అకాడమీ చైర్మన్ కొత్త సతీశ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జూనియర్ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడుతూ గత నెలలో వెలువడిన ఇండియన్ ఆర్మీ ఫలితాల్లో తమ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు ఇండియన్ ఆర్మీ (జీడీ)లో 157 మంది టెక్నీకల్లో 17 మంది ట్రేడ్మెన్ లుగా 14 మంది క్లార్క్ గా ఒకరు ఇండియన్ ఏయిర్ ఫోర్స్ లో నలుగురు ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు.
తమ అకాడమీకీ చెందిన విద్యార్థులు ప్రతి నోటిఫికేషన్ లో పాల్గొని అత్యధిక ఉద్యాగాలు సాధిస్తూ తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలుపడం చాలా సంతోషంగా ఉందన్నారు. మారుతున్న అభ్యర్థుల ఎంపిక విధానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ శ్రద్ధ వహిస్తోందని తెలిపారు.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా వాటి సాధనకై నిరంతరం కృషి చేసేలా ప్రోత్సహిస్తూ వారి పరీక్షలకి అనుగుణంగా శారీరక, మానసిక అభ్యాసాలని విద్యార్థులకి అందిస్తూ రాత మరియు శారీరక పరీక్షల్లో విజయం సాధిస్తున్నామని తెలిపారు. ఇంతటి విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి మరియు సిబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోనే అత్యున్నత భోధనా ప్రమాణాలతో శిక్షణని అందిస్తూ అన్ని ఆర్మీ ర్యాలీలలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో సైనిక ఉద్యోగాల ఆశావహులు, నిరుద్యోగులు చేరి ఉద్యోగులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.









