క్రైంBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి
Accident : శంకర్పల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Accident : శంకర్పల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!
శంకర్పల్లి, (మన సాక్షి):
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో బుధవారం (నిన్న) రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి (45)ని గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతుడి శవాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో (8712663465, 8712663466) పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.









