Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Nalgonda : ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల..!

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.జి ఉపేందర్ రెడ్డి,నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ డి మునిస్వామి డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు.

Nalgonda : ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల..!

నల్లగొండ, మన సాక్షి :

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.జి ఉపేందర్ రెడ్డి, నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ డి మునిస్వామి డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు.

రెండవ, నాల్గవ, ఆరవ రెగ్యులర్ సెమిస్టర్స్, బ్యాక్ లాగ్ కు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్ధిని, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ రెగ్యులర్ మరియు బ్యాక్ లాగ్ విద్యార్ధులు 68 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవి కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్స్ బత్తిని నాగరాజు , మేరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎగ్జామ్ బ్రాంచ్ మెంబర్ ఎన్ కోటయ్య, అసిస్టెంట్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యస్ వాసుదేవ్ ఎన్ వేణు, డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు