Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం

సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్..!

అన్నమయ్య జిల్లా కూటమి రెండేళ్ళ పాలన కేవలం అమరావతి, పోలవరం వరకు మాత్రమే పరిమితం అయిందని, సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్, రెండేళ్ళ కూటమి పాలన‌ పోగ్రెస్ రిపోర్ట్ అట్టర్ ఫ్లాప్ అని మదనపల్లె వైస్సార్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు గుప్పించారు.

సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్..!

పోలవరం, అమరావతి తప్ప రాష్ట్రాభివృద్ధి లేదు

మదనపల్లె వైస్సార్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా కూటమి రెండేళ్ళ పాలన కేవలం అమరావతి, పోలవరం వరకు మాత్రమే పరిమితం అయిందని, సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్, రెండేళ్ళ కూటమి పాలన‌ పోగ్రెస్ రిపోర్ట్ అట్టర్ ఫ్లాప్ అని మదనపల్లె వైస్సార్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వైస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో శుక్రవారం మదనపల్లె మిషన్ కాంపౌండ్ నుంచి చిత్తూరు బస్టాండు సర్కిల్ వరకు వెన్నుపోటుకు రెండేళ్ళు అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దేశయ్ తిప్పారెడ్డి, సీనియర్ నాయకులు ఎన్ .శ్రీనాథరెడ్డి,మండలం వైసీపీ పార్టీ అధ్యక్షులు కేశవరెడ్డి, ఎంపిపి రమణా రెడ్డి, అక్కుల్ రెడ్డి జయరామిరెడ్డి హాజరైనారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‌ఈ సందర్భంగా చిత్తూరు బస్టాండు సర్కిల్ వద్ద నిస్సార్ అహమ్మద్ మీడియాతో మాట్లాడారు.

కూటమి రెండేళ్ళు పాలనపై వైస్సార్సీపీ అదిష్టనం పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు రెండేళ్ళు, జూన్ 4 నుంచి 12 వరకు చేపట్టే నిరసన కార్యక్రమాలు నియోజకవర్గంలో సక్సెస్ అయ్యాయని వివరించారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టిన రెండేళ్ళలో భూ కబ్జాలు, పెట్రెగిపోయాయని ఆరోపించారు.

సూపర్ సిక్స్ హామీలలో ఇచ్చిన ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ బృతి అమలు చేయలేదని, రెండేళ్ళుగా ఇచ్చిన హామీ అమలు చేయక మోసం చేశారని విమర్శలు గుప్పించారు. బిఆర్ నాయడు లాంటి వ్వక్తులు టిటిడి చైర్మన్ గా వుండటం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో ఎటూ చూసిన కల్తీ మద్యం, బెల్టుషాపులు రాజ్యమేలుతున్నాయి, రాష్ట్రాన్ని మద్యాంద్రాప్రదేశ్ గా మార్చేశారని విమర్శలు గుప్పించారు.

పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందనే గొప్ప లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చారని, వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పిపిపి విధానంలో అమలు చేసి సొంత వారికి లబ్ది చేకుర్చాలని సిఎం చంద్రబాబునాయుడు చూస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలు ప్రశిస్తే కేసులు పెట్టి వేదిస్తున్నారని ఆరోపించారు.

మామిడి రైతాంగానికి గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని అన్నారు.‌ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని ఆరోపించారు. మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయిందని ఎద్దేవా చేశారు. ‌

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చింది లేదు.. కానీ తీసేసిన పెన్షన్లు సుమారు 6 లక్షలు పైగా ఉన్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే ఇస్తామని చెప్పిన పించను ఏమైందని ప్రశ్నించారు. ఎందుకు పెన్షన్ తీసేశారని ప్రశ్నిస్తే కారణాలు చెప్పలేక బుకాయిస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ మంత్రిగా ఫెయిల్ అయ్యారని, డిఎస్సీ అవినీతి మయం అయిందని, ఇంక పెద్ద పదవి ఇస్తే ఇంకేం చేస్తారో అని అనుమానాలు వ్యక్తం చేశారు.

కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ‌ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ సమన్వయ నిసార్ అహ్మద్, రామసముద్రం మండలం వైసీపీ పార్టీ అధ్యక్షులు కేశవరెడ్డి, ఎంపిపి రమణారెడ్డి, రాధారెడ్డి, దర్శన్ గౌడ్ పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు