ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే కసిరెడ్డి.!
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మండలంలోని సర్పంచులు, ఎమ్మార్వో కార్తీక్ కుమార్,ఎంపీడీవో ఈసం కృష్ణయ్య మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే కసిరెడ్డి.!
వెల్దండ, మన సాక్షి:
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మండలంలోని సర్పంచులు, ఎమ్మార్వో కార్తీక్ కుమార్,ఎంపీడీవో ఈసం కృష్ణయ్య మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు.
కార్యక్రమంలో సర్పంచులు తమ గ్రామాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనుల అవసరాలు మరియు ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. వాటిని ఎమ్మెల్యే శ్రద్ధగా స్వీకరించి, ప్రతి సమస్యను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని తగిన విధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










