Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్అర్ పల్లెనిద్ర.. నేనున్నానంటూ భరోసా..!
ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట నూతన కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాడ్గులపల్లి మండలంలోని సీత్యా తండ గ్రామంలో పర్యటించారు.

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్అర్ పల్లెనిద్ర.. నేనున్నానంటూ భరోసా..!
మిర్యాలగూడ ( మాడ్గులపల్లి ) మన సాక్షి :
ప్రగతి సింగిడి – జనంతో మాట.. పల్లె బాట నూతన కార్యక్రమంలో భాగంగా
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాడ్గులపల్లి మండలంలోని సీత్యా తండ గ్రామంలో పర్యటించారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాత్రి గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు.
ఆదివారం ఉదయం సంబంధిత శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు సమర్పించిన పలు సమస్యలు, అభ్యర్థనలను స్వీకరించి అత్యవసరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ , ఎంపీడీఓ, ఎఈ, పంచాయతీ రాజ్ సెక్రెటరీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.











