SAI BABA : సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!
దైవచింతన తో మానసిక ప్రశాంతత నెలకొంటుందని బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి పేర్కొన్నారు.

SAI BABA : సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!
చింతపల్లి, మన సాక్షి :
దైవచింతన తో మానసిక ప్రశాంతత నెలకొంటుందని బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న పార్టీ ముఖ్య సమావేశానికి వారు వెళ్తు చింతపల్లి మండలం కేంద్రంలోని స్థానిక సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల సందర్భంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు వారిని సాధరంగా ఆహ్వానించి వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ దేవాలయం మరో షిరిడి దేవాలయంగా వెలుగొందనుందని పేర్కొన్నారు.
ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో స్వామి వారి వార్షికోత్సవాలు ప్రత్యేకంగా నిర్ణయించుకోవడం చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా గోశాలను కూడా ఆలయ నిర్వాహకులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వాహణ చేపట్టడం హిందూ ధర్మ పరిరక్షణకు ఇది నిదర్శనం అన్నారు.
సందర్భంగా ఆలయ నిర్వాహకులను వారు అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి ని వీరితోపాటు ముఖ్య నాయకులను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










