Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
School : మూతబడిన పాఠశాలకు జీవం పోసిన రామగిరి ప్రజలు..!
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరి గ్రామ ప్రజలు ఆదర్శం గా నిలిచి ఔరా అనిపించుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం మూత బడిన తమ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ను తిరిగి ప్రారంభించాలని విశ్వ ప్రయత్నం చేశారు.

School : మూతబడిన పాఠశాలకు జీవం పోసిన రామగిరి ప్రజలు..!
శాలిగౌరారం, మనసాక్షి :
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరి గ్రామ ప్రజలు ఆదర్శం గా నిలిచి ఔరా అనిపించుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం మూత బడిన తమ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ను తిరిగి ప్రారంభించాలని విశ్వ ప్రయత్నం చేశారు. సర్పంచ్ చాడ చంద్ర కళ -హతీష్ రెడ్డి చొరవ తో ఇంటింటికి తిరుగుతూ, ఉపాధి హామీ ప్రదేశాల లో వద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ పాఠశాల లో అన్ని వసతులు, నాణ్యమైన బోధన తో పాటు, ఉదయం అల్పాహారం తో పాటు, మధ్యాహ్నం భోజన సదుపాయం ఉందని విద్యార్థుల తల్లితండ్రుల కు తెలిపారు.
ప్రభుత్వ బడుల్లో చదివిన వారే ఉన్నత పదవుల్లో ఉన్నారని, మీ పిల్లలందరిని మన పాఠశాల కు పంపించాలని కోరారు. గ్రామస్తుల కృషి, సర్పంచ్ చొరవ తో కదిలిన రామగిరి ప్రజలు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాల కు పంపిస్తామని ఒప్పుకోవడం తో బుధవారం ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభించారు.









