Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
ACB : నల్గొండలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన సర్వే అధికారి..!
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నల్గొండ లో ఓ అవినీతి తిమింగలం చిక్కింది.

ACB : నల్గొండలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన సర్వే అధికారి..!
నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నల్గొండ లో ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఒక వ్యక్తి నుంచి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ల్యాండ్ సర్వేయర్ పవన్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిచ్చారు.
ఓ ల్యాండ్ సర్వే కోసం బాధితుడు నుంచి 35వేల రూపాయలు డిమాండ్ చేయగా అందులో భాగంగా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 20 వేల రూపాయలు గతంలోనే వసూలు చేశాడు. కాక బ్యాలెన్స్ ఉన్న పదిహేను వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. కలెక్టరేట్ సమీపంలో బాధితుడు నుంచి 15 వేల రూపాయల తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :









