Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో వివాహిత అనుమానాస్పద మృతి..! 

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన చవ్వా అరుణ (28) అనే వివాహిత శనివారం సాయంత్రం తన అమ్మమ్మ ఊరైన వెంకటాపురంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అరుణ హఠాన్మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Nalgonda : నల్గొండ జిల్లాలో వివాహిత అనుమానాస్పద మృతి..! 

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన చవ్వా అరుణ (28) అనే వివాహిత శనివారం సాయంత్రం తన అమ్మమ్మ ఊరైన వెంకటాపురంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అరుణ హఠాన్మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ముల్కలపల్లి గ్రామానికి చెందిన చవ్వా అరుణ శనివారం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సాయంత్రం సమయంలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయింది. అరుణ మరణంపై ఆమె భర్త చవ్వా మహేందర్ స్పందిస్తూ.. ఆమెకు గుండెపోటు (హార్ట్ ఎటాక్) రావడం వల్లే చనిపోయిందని బంధువులకు సమాచారం అందించాడు.

మృతురాలి శరీర భాగాలపై తీవ్రమైన గాయాల గుర్తులు ఉండటాన్ని గమనించిన పుట్టింటి వారు, బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో సంభవించిన సహజ మరణం కాదని, ఆమె మృతి వెనుక బలమైన అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త మహేందర్ చెప్తున్న మాటల్లో నిజం లేదని, అరుణను శారీరకంగా హింసించడం వల్లే చనిపోయి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్త ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం (శవపరీక్ష) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అరుణ మరణానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.

MOST READ : 

మరిన్ని వార్తలు