Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

కాడెడ్లతో వినూత్న రీతిలో తహసిల్దార్ కార్యాలయం ముందు రైతు నిరసన..!

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని మొగుళ్ళ వంపు గ్రామానికి చెందిన పాండురంగారెడ్డి రెవెన్యూ అధికారులు తన భూ సమస్య పరిష్కరించక పోవడంతో విసిగి వేసారి సోమవారం యాచారం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు వినూత్న రీతిలో తన కాడి ఎడ్లతో నిరసనకు దిగారు.

కాడెడ్లతో వినూత్న రీతిలో తహసిల్దార్ కార్యాలయం ముందు రైతు నిరసన..!

చింతపల్లి, మన సాక్షి :

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని మొగుళ్ళ వంపు గ్రామానికి చెందిన పాండురంగారెడ్డి రెవెన్యూ అధికారులు తన భూ సమస్య పరిష్కరించక పోవడంతో విసిగి వేసారి సోమవారం యాచారం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు వినూత్న రీతిలో తన కాడి ఎడ్లతో నిరసనకు దిగారు.

రైతు పాండురంగారెడ్డి పేర్కొన్న వివరాల ప్రకారం.. మా అన్నదమ్ములకు సర్వే నెంబర్ 98 లో 16 ఎకరాల 20 గుంటల భూమి కలిగి ఉంది. 1985, సంవత్సరంలో 8 ఎకరాలు 1993, లో నాలుగు ఎకరాలు విక్రయించగా మిగులు 4 ఎకరాల 20 గుంటల భూమిలో తన వాటాకు రావాల్సిన 3 ఎకరాలకు తన పేరు మీద పట్టా పాస్ బుక్ ఇచ్చి ఆన్లైన్లో ఎక్కించాలని 15 ఏళ్లుగా ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకోక సమస్యను పరిష్కరించ పోవడంతో విసిగి వేసారి పోయి తన కాడెడ్లతో రైతు పాండురంగారెడ్డి, సోమవారం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన చేపట్టాడు.

దీంతో ఒక్కసారిగా కార్యాలయం ముందు గందరగోళం తలెత్తింది. రెవెన్యూ అధికారులు తన గ్రామానికి వచ్చి వివరాలను సేకరించి తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. 15 ఏళ్లుగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. పాండురంగాయుడు చేస్తున్న నిరసన ధర్నాకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి అంజయ్య , సిపిఎం నాయకులు ఏ మల్లేష్ ఎస్ రాములు రైతుకు అండగా నిలిచి నిరసన చేయడం జరిగింది.

వెంటనే స్పందించిన తాసిల్దార్ అయ్యప్ప, రైతు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే ఆ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి చట్టపరంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతు ఆందోళన విరమించడం జరిగింది కార్యక్రమం లో వివిధ భూ సమస్యలతో తాసిల్దార్ కార్యాలయానికి విచ్చేసిన రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు