క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
విద్యుత్ షాక్ తో రెండు పాడిగేదలు మృతి..!
విద్యుత్ షాక్ తో రెండు పాడిగేదలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్ తో రెండు పాడిగేదలు మృతి..!
వేములపల్లి, మన సాక్షి:
విద్యుత్ షాక్ తో రెండు పాడిగేదలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన జిన్నా సతీష్ రెడ్డికు చెందిన రెండు పాడిగేదలు రోజు మాదిరిగా మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన పాడిగేదల విలువ లక్ష రూపాయలు ఉంటుందని,విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితులు వేడుకున్నారు.









