రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.. ముందుకొచ్చిన చెన్నై వ్యాపారులు..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం రైతు ఉత్పత్తి దారుల సంఘం యొక్క కార్యాలయానికి శుక్రవారం చెన్నై కు చెందిన ఆదిరైయన్ ఆగ్రో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు రామ్మోహన్,రాజ్ కుమార్,రవికుమార్ శుక్రవారం మండలంలో పర్యటించారు .

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.. ముందుకొచ్చిన చెన్నై వ్యాపారులు..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా రామసముద్రం రైతు ఉత్పత్తి దారుల సంఘం యొక్క కార్యాలయానికి శుక్రవారం చెన్నై కు చెందిన ఆదిరైయన్ ఆగ్రో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు రామ్మోహన్, రాజ్ కుమార్,రవికుమార్ శుక్రవారం మండలంలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా రైతుల పొలాలు దగ్గరికి వెళ్లి రైతులు పండించిన ఏ పంట నైనా కంపెనీ ద్వారా కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా మంచి గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు.
అలాగే అన్నమయ్య జిల్లా ఎఫ్ పిఓ ఎస్ కోఆర్డినేటర్ రమణ మాట్లాడుతూ రామసముద్రం, పెద్దతిప్ప సముద్రం, మొలకలచెరువు,పెద్దమండ్యం,బి. కొత్తకోట,గాలివీడు, రైతు ఉత్పత్తి దారుల సంఘం ద్వారా కంపెనీ వాళ్ళతో మాట్లాడి రైతులు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధర ఉండేటట్లు మాట్లాడి, రైతుల సమక్షంలో అగ్రిమెంట్ చేసుకొని రోజు పండించే పంటలను రోజు ఎగుమతి చేయుటకు ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు.
రైతులు పండించే మొక్కజొన్న, రాగి, శనగ, బొప్పాయి, ఖరుబూజ, చింతపండు, క్యారెట్, బీట్ రోట్ వేసే రైతులు వద్దకు శ్రీలక్ష్మి జనార్ధనస్వామిఎఫ్ పి ఓ ఎస్ కో ఆర్డినేటర్ సిబ్బంది వెళ్లి వారితో సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదు కుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆదిరైయన్ కంపెనీ ప్రతినిధులు, రామ సముద్రం సీఈవో ప్రియాంక,గుంతలపేట శంకర అన్నమయ్య జిల్లా ఎఫ్ఈఓలు, సిఈఓలు రైతులు పాల్గొన్నారు .









