వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల మంజూరుకు ఎమ్మెల్యే హామీ
నిజామాబాదు జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేయి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి రూ. 10 లక్షల రూపాయల ప్రత్యేక నిధుల నుండి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు..

వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల మంజూరుకు ఎమ్మెల్యే హామీ
ఆర్మూర్, మన సాక్షి
నిజామాబాదు జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేయి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి రూ. 10 లక్షల రూపాయల ప్రత్యేక నిధుల నుండి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు..
శుక్రవారం ఆలూర్ మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే, స్థానిక నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణాన్ని, అక్కడ జరుగుతున్న పలు నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించి,ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు.
ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, అలాగే క్షేత్ర అభివృద్ధి పనుల నిమిత్తం తన శాసనసభ్యుల ఎమ్మెల్యే కోటా నిధుల నుండి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు సమక్షంలో హామీ ఇచ్చారు. ఆలయ విస్తరణకు, మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
నిధుల ప్రకటనపై ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ,ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.