Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలర్ట్.. ముంచెత్తుతున్న వర్షాలు.. రైలు, విమాన సేవలకు అంతరాయం..!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ముంబై మహానగరంలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలర్ట్.. ముంచెత్తుతున్న వర్షాలు.. రైలు, విమాన సేవలకు అంతరాయం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ముంబై మహానగరంలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా రైలు సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

గత 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో సుమారుగా 600 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో ముంబై – పూణే మార్గంలో ఖర్జత్ – లోనావాలా ఘాట్ రోడ్ లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పూణే జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ లోనవాలాలో గత 24 గంటల వ్యవధిలోనే 670 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ముంబై తో పాటు థానే, పూనే, పాల్కర్ ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకు అధికారులు అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నారు. దాంతో వాతావరణ విభాగం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబై నగరం జలమయంగా మారడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు