Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణపెద్దపల్లి జిల్లా

TS News: తెలంగాణలో దారుణం.. నిద్రిస్తున్న భర్తను బండరాయితో కొట్టి చంపిన భార్య, కొడుకు..!

పెద్దపల్లి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. నిద్రిస్తున్న భర్తను బండరాయితో భార్య, కొడుకు కొట్టి చంపారు. కుటుంబ కలహాల కారణంగా తన సొంత భార్య కొడుకు చేతిలోనే హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

TS News: తెలంగాణలో దారుణం.. నిద్రిస్తున్న భర్తను బండరాయితో కొట్టి చంపిన భార్య, కొడుకు..!

మన సాక్షి, పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. నిద్రిస్తున్న భర్తను బండరాయితో భార్య, కొడుకు కొట్టి చంపారు. కుటుంబ కలహాల కారణంగా తన సొంత భార్య కొడుకు చేతిలోనే హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యద్ గోరెమియా అనే వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. రోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవలు చేయడం, కుటుంబ సభ్యులను వేధించడం నిత్య కృత్యంగా మారింది. దాంతో అతని భార్య గోరేబి, కొడుకు సయ్యద్ అలీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

వేధింపులకు ముగింపు పలకాలని ఉద్దేశంతో వారు ఘాతుకానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న సమయంలో గోరేమియాను ఆయన భార్య కొడుకు కలిసి అతడిపై దాడి చేసి బండరాయితో నిద్రిస్తున్న అతనిపై దాడి చేశారు. దాంతో గోరేమియాకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. నిందితులైన భార్య, కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు