Hyderabad : జనసేన పార్టీలో చేరిన అడ్వకేట్ రవి వర్మ..!
శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదర్‌నగర్ డివిజన్ వెర్టెక్స్ ప్రైమ్ కు చెందిన న్యాయవాది రవి వర్మ, శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో హైదరాబాద్‌లో జనసేన పార్టీలో చేరారు.

Hyderabad : జనసేన పార్టీలో చేరిన అడ్వకేట్ రవి వర్మ..!
కూకట్ పల్లి, మన సాక్షి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదర్‌నగర్ డివిజన్ వెర్టెక్స్ ప్రైమ్ కు చెందిన న్యాయవాది రవి వర్మ, శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో హైదరాబాద్‌లో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవ, పారదర్శక పాలన, రాజ్యాంగ విలువల పరిరక్షణ, యువత సాధికారత వంటి అంశాల్లో జనసేన పార్టీ అవలంబిస్తున్న విధానాలు తనను ఆకర్షించాయని తెలిపారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని, సమాజాభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ వేదికగా చురుకుగా పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి, చేరికల కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డా. గడల శ్రీనివాస్, ప్రజీత్ గౌడ్, తనీష్, సీనియర్ నాయకులు రాజ లింగం, రామ కృష్ణ, సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు రవి వర్మకు స్వాగతం పలికి, పార్టీ బలోపేతానికి ఆయన సేవలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.









