Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజాతీయం

పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!

పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందనే మనస్థాపంతో తన ఇద్దరు పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని పుదుక్కొట్టయి సమీపంలో సవేరియాపురం ఈ ఘటన జరిగింది.

సవేరియాపురం కు చెందిన మరియా మైఖేల్, సబిత రోనికా దంపతులు ఉండేవారు. మైఖేల్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సబిత రోనిక ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటుంది. వీరికి కుమార్తె నిరోషా కుమారుడు కెనిష్టన్ ఉన్నారు.

గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు రావడంతో ఆరు నెలల క్రితం సబిత భర్తను, పిల్లలను వదిలేసి ఇంటి నుండి వెళ్లిపోయింది. దాంతో మైఖేల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. డిప్రెషన్ లో ఉన్న అతను పిల్లలను చంపేసి తాను చనిపోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో నిద్రలో ఉన్న 14 సంవత్సరాల కుమార్తె, 12 సంవత్సరాల కుమారుడికి కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. అనంతరం తాను సైతం విద్యుత్ షాక్ తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు