Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట చర్చికాంపౌండ్ లో పోలీసుల అష్ట దిగ్బంధనం.. ఒక్క ఇంటిని వదలకుండా తనిఖీ..!

ప్రజల రక్షణ కోసం పోలీసులు ఉన్నారని, నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ప్రజల రక్షణకోసమే నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు.

Suryapet : సూర్యాపేట చర్చికాంపౌండ్ లో పోలీసుల అష్ట దిగ్బంధనం.. ఒక్క ఇంటిని వదలకుండా తనిఖీ..!

80 వాహనాలు సీజ్, ప్రతి ఇల్లు తనిఖీ.

తనిఖీల్లో పాల్గొన్న డీస్పీ, సిఐ, 10 మంది ఎస్ఐ లు సహా మొత్తం 100 మంది పోలీసులు.

సూర్యాపేట, మనసాక్షి :

ప్రజల రక్షణ కోసం పోలీసులు ఉన్నారని, నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ప్రజల రక్షణకోసమే నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని
సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. సూర్యాపేట పట్టణలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పట్టణంలోని చర్చికాంపౌండ్ కాలనీలో పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్, తనిఖీలు ఆపరేషన్ నిర్వహించారు.

సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో, పట్టణ సీఐ వెంకటయ్య, నేతృత్వంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ఆపరేషన్ అత్యంత పటిష్టంగా ప్రణాళిక మేరకు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కాలనీలోని అన్ని ఇళ్లను, వాహనాలను మరియు అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

 

ఈ ఆపరేషన్‌లో డిఎస్పీ, సిఐ, ఎస్ఐ లు, 100 పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని కారణంగా 80 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట డివిజన్ డిఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రతంకల్పించడం, సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టడం, ప్రజల్లో నమ్మకాన్ని పెనచడం లో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం అన్నారు.

కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు, గుర్తింపు లేని వారికి ఇండ్లు కిరాయికి ఇవ్వొద్దు అన్నారు. వాహనాలకు అన్ని అనుమతి పత్రాలు ఉండాలని కోరారు. రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్ధాలు కాలనీకి రాకుండా జాగ్రత్తగా ఉండాలని , మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దు అని గంజాయి జీవితాలను నాశనం చేస్తుంది అన్నారు.

అసాంఘిక కార్యకలాపాలు పట్ల, అక్రమ రవాణా పట్ల, గంజాయి పట్ల పోలీసులకు సమాచారం ఇవ్వాలి డయల్ 100, 112 లకు తెలియజేయాలని కోరారు. కాలనీలో రక్షణగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. పోలీసు శాఖ అనుక్షణం రక్షణ కల్పిస్తూ రాత్రింబవళ్ళు గస్తీ నిర్వహిస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు