Nalgonda : డిసిసి జనరల్ సెక్రటరీగా ఎరుకల వెంకటయ్య గౌడ్ ఎన్నిక..!
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామపంచాయతీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్ డిసిసి జనరల్ సెక్రెటరీగా రెండవసారి ఎన్నిక కావడం పట్ల చింతపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వారి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు అందజేశారు.

Nalgonda : డిసిసి జనరల్ సెక్రటరీగా ఎరుకల వెంకటయ్య గౌడ్ ఎన్నిక..!
చింతపల్లి, మన సాక్షి :
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామపంచాయతీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్ డిసిసి జనరల్ సెక్రెటరీగా రెండవసారి ఎన్నిక కావడం పట్ల చింతపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వారి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు అందజేశారు.
గత 40 సంవత్సరాలు నుండి తాను నమ్మిన సిద్ధాంతాన్ని వమ్ము చేయకుండా , ఏ పార్టీకి నమ్మకద్రోహం చేయకుండా , ఆ పార్టీ విధి విధానాలకు కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి అనుగుణంగా ఉంటూ తన దైన వెంకటయ్య గౌడ్ .అన్నారు. తనకు నీడనిచ్చిన పార్టీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తూ ముందుకు వెళుతూ బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ, నిరుపేద ప్రజల అభ్యున్నతికి తాను వెన్నంటుగా ఉండి పని చేస్తానన్నారు..
వెంకన్న అంటే నేను ఉన్న అంటూ, ఏ సమస్య అయినా తన భుజాన వేసుకొని, నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులను కూడా పక్కనపెట్టి 40 సంవత్సరాల సుధీర్ గా రాజకీయ లక్ష్యంతో సేవలందిస్తూ ముందుకు ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎరకల వెంకటయ్య గౌడ్.,బడుగు బలహీన వర్గాల కోసం తన జీవిత పోరాటం పదవులు తనకు ముఖ్యం కాదని గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే తన లక్ష్యం అన్నారు. చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎల్లవేళలా వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్నారు.
ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానా రు. అదేవిధంగా చింతపల్లి మండల ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒకరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..