TG News : సైకో కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడ.. వెలుగులోకి సంచలన విషయాలు..!
ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా ఆరుగురిని అతికిరాతంగా హత్య చేసిన సైకో కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడ..?

TG News : సైకో కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడ.. వెలుగులోకి సంచలన విషయాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా ఆరుగురిని అతికిరాతంగా హత్య చేసిన సైకో కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడ..? అనే విషయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయంశమైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన కిల్లర్ రాజ్ కుమార్ ను పట్టుకునేందుకు 14 పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. అయినా కూడా రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు.
ఆరుగురిని హత్య చేసిన అనంతరం తన తండ్రికి తాను చనిపోతున్నట్లు ఫోన్ చేసి చెప్పిన రాజకుమార్ ఇప్పటివరకు ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అయితే పోలీసులు రాజకుమార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డిసిపి యోగేష్ గౌతమ్ కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
సైకో కిల్లర్ రాజకుమార్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకుమార్ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి హత్యలు చేసిన అనంతరం 11:50 గంటలకు నిందితుడు రాజకుమార్ ఫోన్ స్విచాఫ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్యలు చేశాక నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలాల్లో నిర్మానుష ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు.
కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రాగానే కారులో పెట్రోల్ అయిపోవడంతో ఆ కారును అక్కడే వదిలేసినట్లు తెలుస్తోంది. పక్కనే జాతీయ రహదారి ఉండడంతో బెంగళూరు శ్రీశైలం రోడ్లలో పరారై ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాజ్ కుమార్ ఎక్కువగా శ్రీశైలం వెళ్లేవాడని అక్కడే గడిపే వాడని అక్కడ కూడా పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.
రైలు పట్టాల వద్ద కారును వదిలేసి ఆత్మహత్య చేసుకోవాలని రాజకుమార్ భావించినట్లు తెలుస్తుంది. కానీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజశేఖర్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకొని పరారైనట్లు సమాచారం. అంతేకాకుండా అతడు ఫోన్లు, సిమ్ కార్డులు కూడా వాడుతున్నాడా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.









