Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..!
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన చీముల అంజయ్య , కొలిశాల జానకమ్మ ఇటీవల మృతి చెందారు.

Miryalaguda : మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..!
వేములపల్లి, మన సాక్షి:
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన చీముల అంజయ్య , కొలిశాల జానకమ్మ ఇటీవల మృతి చెందారు. సోమవారం ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ సహకారంతో అంజయ్య కుటుంబానికి రూ.15 వేలు, జానకమ్మ కుటుంబానికి రూ.5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య,మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి లు అందజేశారు. కష్టకాలంలో మృతుల కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
వారి వెంట ఉప సర్పంచ్ పల్లా గోవర్ధన్, మాజీ ఉప సర్పంచ్ తరి సైదులు, బిఆర్ఎస్ యువ నాయకులు సందరబోయిన సాయి కుమార్, సీనియర్ నాయకులు జిన్నా శేఖర్ రెడ్డి, వంగాల సంజీవ చారి, అశోక్, చీముల వెంకన్న,సతీష్, శ్రీను,సైదులు తదితరులు ఉన్నారు.









