Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

యంత్రమెట్లా నడుస్తూ.. ఉందంటే.. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు..!

వ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించడం పరిపాటిగా మారింది. ఆధునిక యంత్రాల సహాయంతో రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఆధునిక యంత్రాలతో సమయం ఆదా కావడంతో పాటు అధిక దిగుబడి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. దాంతో రైతులు ఎక్కువగా ఆధునిక యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.

యంత్రమెట్లా నడుస్తూ.. ఉందంటే.. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు..!

తుంగతుర్తి మన సాక్షి :

వ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించడం పరిపాటిగా మారింది. ఆధునిక యంత్రాల సహాయంతో రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఆధునిక యంత్రాలతో సమయం ఆదా కావడంతో పాటు అధిక దిగుబడి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. దాంతో రైతులు ఎక్కువగా ఆధునిక యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారం మండలంలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయరంగా కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న పెనుమార్పులకు కాడెడ్లు కనుమరుగై.. ఆ స్థానంలో ఆధునిక యంత్రపరికరాలు వినియోగంలోకి వచ్చాయి. నాడు రైతులు అరక దున్నాలన్నా, గుంటుకొట్టాలన్నా, విత్తనాలువేయాలన్నా, కలుపు తీయాలన్నా, నాటు వేయాలన్నా ఎడ్లను, కూలీలను ఉపయోగించేవారు.

కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నేడు అదే పనికి యంత్రాలను వినియోగిస్తున్నారు. నాడు వ్యవసాయ రంగంలో రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన ఎడ్లు….నేడు వివిధ కారణాలతో అవే రైతన్నకు భారంగా మారాయి. దీనికి తోడు వ్యవసాయరంగంలో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావడం, ప్రభుత్వం యంత్రాలపై సబ్సీడీలు అందిస్తుండటంతో రైతులు వాటివైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.

కూలీలు నాలుగు రోజుల్లో చేసే పనిని.. ప్రస్తుతం యంత్రాల సహాయంతో రైతులు ఒకటి రెండు రోజుల్లో వేగంగా పూర్తి చేస్తున్నారు. నాడు పంటలను కూలీలు నూర్పిడిలు చేయగా నేడు అదే పంటలను వరికోత యంత్రాలు చేస్తున్నాయి. ప్రస్తుతం పొలాలు దున్నడానికి రైతులు నాగలి కంటే ట్రాక్టర్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అలాగే కలుపు తీయడానికి కలుపు యంత్రాలు, మందు పిచికారికి పిచికారి యంత్రాలు ఇలా అనేక రకాల యాంత్రాలు అందుబాటులోకి వస్తుండటంతో వ్యవసాయ రంగా ఆధుక పద్దతులవైపు దూసుకెళుతుంది.

సమయం ఆదా :

వ్యవసాయ పనులకు యంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో సమయం ఆదాకావడమే కాకుండా కూలీల సంఖ్య, ఖర్చు రెండు తగ్గుతున్నాయి. గతంలో రైతులు పురాతన పవర్‌ స్పేయర్ల ద్వారా రోజంతాకష్టపడ్డా రోజుకి రెండు ఎకరాల కంటే మించి పిచికారి చేసేవారు కాదు. నేడు అందుబాటులోకి వచ్చిన అధునాత పవర్‌ స్పేయర్లతో రోజుకు 10 ఎకరాల మందును పంటలపై పిచికారి చేస్తున్నారు. నాటు వేయడానికి, కలుపు తీయడానికి, విత్తనశుద్ది చేయడానికి ఇలా ప్రతి పనికి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. నాడు కాడెడ్లు, నేడు యంత్రాలే రైతులకు నేస్తాలుగా మారాయి.

యంత్రాలు లేని సాగు కష్టమే- 
మల్లేపాక రవీందర్, రైతు, పసునూర్‌.

కూలీల కొరత తీవ్రంగా ఉన్న కారణంగా ప్రస్తుత తరుణంలో యంత్రాలు లేకుండా వ్యవసాయం చేయడం కష్టమే. యంత్రాల వినియోగంతో కూలీలపై ఆధారపడాల్సిన పనిలేకుండా పోయింది. వ్యవసాయంలో వచ్చిన ఆధునిక పద్దతులు, యంత్రాల వినియోగంపై సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి.

By : సుభాష్ , తుంగతుర్తి 

మరిన్ని వార్తలు