Narayanpet : నారాయణపేట కలెక్టరేట్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు హల్ చల్.. న్యాయం చేస్తారా.? కారుణ్య మరణానికి అనుమతిస్తారా.? అని ప్లకార్డు ప్రదర్శన..!
నారాయణపేట కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ తనకు న్యాయం చేస్తారా లేక నాకు కారుణ్య మరణానికి అనుమతి ఇస్తారా అంటూ ప్లేకార్డు ప్రదర్శిస్తూ హాల్ చల్ చేశారు.

Narayanpet : నారాయణపేట కలెక్టరేట్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు హల్ చల్.. న్యాయం చేస్తారా.? కారుణ్య మరణానికి అనుమతిస్తారా.? అని ప్లకార్డు ప్రదర్శన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ తనకు న్యాయం చేస్తారా లేక నాకు కారుణ్య మరణానికి అనుమతి ఇస్తారా అంటూ ప్లేకార్డు ప్రదర్శిస్తూ హాల్ చల్ చేశారు. తనకు అన్యాయం చేసిన నారాయణపేట తహసీల్దార్ను,కలెక్టరేట్ లో ఉన్న దితి బాలరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట మండలం అభాంగాపూర్ శివారులో కోటకొండకు చెందిన వ్యక్తి కరుబసప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా ఆభూమిలో ఆయిల్ ఫాం సాగు చేస్తున్నాడనీ తెలిపారు. అంతే కాకుండా ఆక్రమించిన ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేయడంతో ఆపై భాగంలో ఉన్న దాదాపు 50 ఎకరాలకు పైగా బాటలేక సభ్యులు బీడుగా మారాయి.
ఈ విషయంపై తను గత మూడేళ్లుగా పోరాటం చేస్తున్న రెవిన్యూ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కరుబసప్ప సర్వే నెంబర్ 524 ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు సర్వే లో తేలినా ఈ విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడం లేదని చంద్ర శేఖర్ తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం తహశీల్దార్ అవినీతి కారణంగానే జరిగిందని తెలిపారు.
కాగా ఫిర్యాదు చేస్తే తననే కేసు పెడతానని తహసీల్దార్ భయపెడు తున్నారని అన్నారు. ప్రజావాణిలో పలుమార్లు వినతి పత్రం సమర్పించినా న్యాయం జరుగడం లేదని అన్నారు.జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ఆయిల్ ఫాం సాగు చేస్తూ ప్రభుత్వ పరంగా సబ్సిడీ పొందుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆవ్యక్తి సహకరిస్తున్న నారాయ ణపేట తహశీల్దార్,డి టి పై చర్యలు తీసుకోవాలని కోరారు.









