టీడిపి కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం..!
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాల సంక్షేమానికి టిడిపి కృషి చేస్తుందని టిడిపి జిల్లా సీనియర్ నాయకులు వుప్పల రమేష్ అన్నారు.

టీడిపి కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం..!
చింతపల్లి, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాల సంక్షేమానికి టిడిపి కృషి చేస్తుందని టిడిపి జిల్లా సీనియర్ నాయకులు వుప్పల రమేష్ అన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త సూరు వేలాద్రి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ కార్యకర్తగా టిడిపిలో ఉంటూ కష్ట పడే పనిచేసిన కార్యకర్త కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించి తెదేపా సభ్యత్వం పొంది ఉన్నటువంటి సూరు వేలాద్రి కుటుంబానికి బీమా సౌకర్యం క్రింద రూ. 5 లక్షల రూపాయలను మృతుని కుటుంబ సభ్యుల ఖాతాలోకి ఖాతాలోకి మంజూరు చేయించడం జరిగింది.
పార్టీ కార్యకర్తకు బీమా సహాయం అందించి ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ భరోసా కల్పించడం జరిగిందన్నారు. బీమా మంజూరు చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కు రాష్ట్ర కమిటీకి మృతుని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డగోని పెద్దయ్య, రావిరాల సీనయ్య, కానుగుల సత్తయ్య, సిరగోని నందు సిరగోని శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.









