Miryalaguda : ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ కీలక ఆదేశం.. కాలువల మరమ్మత్తులు నాణ్యతతో పాటు వేగవంతం చేయాలి..!
మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు సాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

Miryalaguda : ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ కీలక ఆదేశం.. కాలువల మరమ్మత్తులు నాణ్యతతో పాటు వేగవంతం చేయాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు సాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
నియోజకవర్గంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ పనుల పురోగతి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న పనులు, అలాగే రైతుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నూతన సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులు పూర్తి స్థాయిలో పెంచాలి అని అదేశించారు. తద్వారా భవిషత్తులో రైతులకి బావులలో , బోర్లలో నీటి శాతం తగ్గకుండా ఉంటుందని సూచించారు.
ఈ సందర్భంగా ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో చేపట్టాల్సిన కొత్త ఇరిగేషన్ ప్రతిపాదనలపై కూడా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో 11 కోట్లతో నిర్వహిస్తున్న ఎన్ ఎస్ పి లెఫ్ట్ కెనాల్ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేసి, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కాలువ మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు సకాలంలో సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఎన్ ఎస్ పి ఎస్.సి మల్లికార్జున రావు, ఈ ఈ గోపినాథ్, ఈఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.










