Breaking Newsక్రైంజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా
హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్న కార్లు..!
హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారిపై రాగాయిపల్లి గేట్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్న కార్లు..!
వెల్దండ, మన సాక్షి:
హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారిపై రాగాయిపల్లి గేట్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు కార్ల ముందరి భాగం పూర్తిగా నజ్జయిపోయాయి, అయితే కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, కార్లలో ఉన్న బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్థానికులు తెలిపారు.
ఈ రహదారిపై నిత్యం పెరుగుతున్న వాహనాల రద్దీతో, ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందని, విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాలుగు లైన్ల రోడ్డు వేసి డివైడర్లను ఏర్పాటు చేసి, ప్రమాద భారీ నుండి ప్రజలను కాపాడాలని కోరారు.









