Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsక్రైంతెలంగాణ

Video : ఆరుగురిని హత్య చేసిన సైకో కిల్లర్ సెల్ఫీ వీడియో లో సంచలనం.. (వీడియో)

అరుగురిని హాత్య చేసే ముందు సైకో కిల్లర్ తన మొబైల్ లో సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసినట్లుపోలీస్ విచారణలో తేలింది. ఆ వీడియోలను పోలీసులు మీడియాకు చూపించారు. ఆ వీడియోలో ఉన్మాది మానసిక స్థితి, ప్రతీకారం స్వచ్ఛంగా కనపడుతుంది.

Video : ఆరుగురిని హత్య చేసిన సైకో కిల్లర్ సెల్ఫీ వీడియో లో సంచలనం.. (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్ :

అరుగురిని హాత్య చేసే ముందు సైకో కిల్లర్ తన మొబైల్ లో సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసినట్లుపోలీస్ విచారణలో తేలింది. ఆ వీడియోలను పోలీసులు మీడియాకు చూపించారు. ఆ వీడియోలో ఉన్మాది మానసిక స్థితి, ప్రతీకారం స్వచ్ఛంగా కనపడుతుంది. నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం ఉన్న ప్రాంతంలో అతని మొబైల్ ఫోన్ కూడా దొరికిందని సైబరాబాద్ సీపీ తరుణ్ జోష్ స్పష్టం చేశారు.

జూలై 10వ తేదీన సాయంత్రం 4:55 గంటల ప్రాంతంలో సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఆరుగురుని ఊచకోత కోయడానికి ముందుగా ఈ వీడియో తీసినట్లుగా ఉంది. వీడియోలో ఆర్థిక మోసాలు, నమ్మకద్రోహం అందుకోసం తాను హాత్యలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అమ్మాయిని గుడ్డిగా నమ్మి సర్వస్వం కోల్పోయానని, తన సంపాదనలో సగానికి పైగా వారి కోసం ఖర్చు పెట్టానని చెప్పుకున్నాడు.

తన దగ్గర డబ్బులు వసూలు చేసి తనను పూర్తిగా నష్టాల్లోకి నట్టేసి చివరకు తన పిల్లలకు చేతిలో పైసా కూడా ఉండకుండా కాస్త భూమి కూడా లేకుండా రోడ్డున పడేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తను సర్వస్వం కోల్పోయాక తనపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని పేర్కొన్నాడు. అందుకు హత్యలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

VIDEO

MOST READ : 

మరిన్ని వార్తలు