Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
Narayanpet : రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో పేట అథ్లెట్ల అసమాన ప్రతిభ..!
రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నారాయణపేట జిల్లా కు చెందిన అథ్లెట్స్ అసమాన ప్రతిభ చూపించి వివిధ మెడల్ లు గెలుపొందారు.

Narayanpet : రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో పేట అథ్లెట్ల అసమాన ప్రతిభ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నారాయణపేట జిల్లా కు చెందిన అథ్లెట్స్ అసమాన ప్రతిభ చూపించి వివిధ మెడల్ లు గెలుపొందారు. అండర్ 10 లో మహిత 60 ఎం ఎల్ ఎస్ లో గోల్డ్ మెడల్ సాధించింది. అండర్ 12 లో రాహుల్ 60 ఎం ఎల్ స్ లో గోల్డ్ మెడల్, 300 ఎంఎల్ ఎస్ లో బ్రౌన్ మెడల్, అండర్ 16 లో పూజ 69 ఏం ఎల్ ఎస్ లో గోల్డ్ మెడల్, అండర్ 14 లో రాజేశ్వరి సిల్వర్ మెడల్, అండర్ 8 లో నిహారిక 60 ఎం ఎల్ ఎస్ లో బ్రౌన్ మెడల్, అండర్ 10లో కావ్య లాంగ్ జంప్ లో బ్రౌన్ మెడల్ సాధించి ప్రతిభ చూపారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణ తెలిపారు. వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పుల్లెల గోపి చంద్, రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.









