Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Oil Palm : ఎల్ నినో ప్రభావం.. ఆయిల్ పామ్ తోటల్లో ఇలా సాగు చేస్తే అధిక దిగుబడి..!

ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రైతులంతా ఎంతో ఆశతో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటల్లో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటిం చడం ద్వారా మొక్కల్లో ఆరోగ్యాన్ని, ఉత్పాదకతలను నిలువరించే అవకాశం ఉంటుందని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్ అన్నారు.

Oil Palm : ఎల్ నినో ప్రభావం.. ఆయిల్ పామ్ తోటల్లో ఇలా సాగు చేస్తే అధిక దిగుబడి..!

సూర్యాపేట, మనసాక్షి :

ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రైతులంతా ఎంతో ఆశతో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటల్లో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటిం చడం ద్వారా మొక్కల్లో ఆరోగ్యాన్ని, ఉత్పాదకతలను నిలువరించే అవకాశం ఉంటుందని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్ అన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఎల్ ని నో పరిస్థితుల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పగటిపూట సాపేక్ష ఆర్ద్రత తగ్గుతుంది. దీని వల్ల వాతావర ణంలో తీవ్రమైన కొరత ఏర్పడుతుందన్నారు.

పొడి వాతావరణం పరిస్థితులు ఏర్పడి గెలలు పూర్తిగా తయారుకావు. మగ పుష్పగుచ్చాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. 3సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పామాయిల్ మొక్కలకు వేరు వ్యవ స్థలు పైన నే ఉంటాయి కావునా పై మట్టి పొర ఎండిపోవడం వల్ల ఆ వేర్లు ప్రభావితమవుతాయి. పొడి వాతావరణ ఎక్కువ కాలం కొనసాగితే మొక్కల మనుగడకు ముప్పు వాటిల్లుతుందిన్నారు.
అదనపు నీటి పారుదల కొనసాగించకపోతే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

 

అధికారుల సూచనలు :

రక్షణాత్మక నీటిపారుదల, తేమ సంరక్షణ చర్యలు పాటించాలని,క్రమం తప్పకుండా సూక్ష్మ పద్దతిలో నీటిపారుదల జరిగేలా చూసుకోవాలని చెట్టు దీర్ఘకాలిక తేమ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలన్నారు..

మల్చింగ్ పద్దతి పాటించాలి :

మొక్క మొదలు చుట్టూ కత్తిరించిన ఆకులు లేదా సేంద్రీయ జీవ పదార్థాంతో ఒక పొరగా కప్పటం వల్ల నేలలోని తేమ గణనీ యంగా ఆదా అవుతుందని,దీని వలన సూక్ష్మ వాతావరణాన్ని చల్లబరు స్తుందిని తద్వారా నీటి నష్టాన్ని తగ్గిస్తుందన్నారు.

అదనపు పొటాషియం మోతాదు వేయడం:

అధిక ఉష్ణో గ్రతల ఒత్తిడి ఉన్న కాలంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయకూడదు. నీటి ఒత్తి డిని తట్టుకోవడానికి ప్రతి చెట్టుకు ఇచ్చే సాధారణం కంటే 0.5కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదనంగా అందించాలి.

పరాగ సంపర్కం చేసే వీవిల్స్పై ప్రభావం:

అధిక ఉష్ణోగ్రతల వల్ల పరాగ సంపర్కం చేయు వివిల్స్ మనుగడ, విస్తరణ ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది అంతిమంగా పరాగ సంపర్కం సరిగ్గా జరగకపోవ డానికి, ఫలితంగా గెలలు విచ్చిన్నం కావడానికి దారి తీస్తుంది. కొత్తగా ఏర్పాటుచేసిన, ఒంటరి తోటల్లో వీటి స్థిరనివాసం తగ్గే అవ కాశం ఉంది, కావున తోటల్లో తేమను పెంచడానికి బిందు సేద్య వ్యవస్థలో అవుట్లెట్ తెరిచి ఉంచాలని,వేడి ఒత్తిడిని తగ్గించడానికి కోకో, వోక్క వంటి అంతర పంటలు వేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు