TG News : తెలంగాణలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రోజు నుంచి పంపిణీ..!
తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ పై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఎంతో కాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆమె అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.

TG News : తెలంగాణలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రోజు నుంచి పంపిణీ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ పై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఎంతో కాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆమె అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల పంపిణీ ఆగస్టు 15వ తేదీ నుంచి అందించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
తాజాగా ములుగు జిల్లా పర్యటనలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ పై స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు లక్షలాదిమంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చేలా కసరత్తు చేస్తుంది. పింఛన్ల పంపిణీ పారదర్శకంగా ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. లబ్ధిదారులు ఎవరైనా మరణిస్తే వారి పేరు తొలగించి నిజమైన అర్హులకు పింఛన్లు చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :









