Missing : హైదరాబాద్ మహానగరంలో భారీ సెన్సేషన్.. ముగ్గురు బాలికల అదృశ్యం..!
హైదరాబాద్ మహానగరంలో భారీ కలకలం రేపుతోంది. ఒకేసారి ముగ్గురు బాలికలు అకస్మాత్తుగా అదృశ్యం అయ్యారు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిన ఆ ముగ్గురు బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు.

Missing : హైదరాబాద్ మహానగరంలో భారీ సెన్సేషన్.. ముగ్గురు బాలికల అదృశ్యం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
హైదరాబాద్ మహానగరంలో భారీ కలకలం రేపుతోంది. ఒకేసారి ముగ్గురు బాలికలు అకస్మాత్తుగా అదృశ్యం అయ్యారు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిన ఆ ముగ్గురు బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి వచ్చి దోమలగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న వలస కార్మికుల కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలికలు స్నేహ, లలిత, లత ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లారు. రాత్రి అయిన వారు ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సిసి కెమెరాల్లో గుర్తింపు :
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికలు వెళ్లిన మార్గాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. మొదటగా హిమాయత్ నగర్ ప్రాంతంలో ఓ ఆటో ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ఆటో కాచిగూడ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా అక్కడ బాలికలు ఆటో దిగినట్లు సీసీటీవీ ఫుటేజీ స్పష్టంగా రికార్డు అయింది. అయితే వాళ్లు రైల్వే స్టేషన్ కు ఎందుకు వెళ్లారు..? సొంత రాష్ట్రం చత్తీస్గడ్ వెళ్లేందుకు రైలు ఎక్కారా..? లేక వేరే ఎక్కడికైనా వెళ్లారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
MOST READ :