ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి రెండు పేజీల సూసైడ్ నోట్..!
హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైన్ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో కొత్త టెస్ట్ నెలకొన్నది.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి రెండు పేజీల సూసైడ్ నోట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైన్ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో కొత్త టెస్ట్ నెలకొన్నది. ఈ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పై వచ్చిన ఆరోపణలు నిజమే అని విచారణలో తేలడంతో ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తన సూసైడ్ నోట్లో నలుగురు వ్యక్తులు కారణమని రాసినట్లు తెలుస్తోంది. తన తోటి ఐపీఎస్ బ్యాచ్ మేట్ తో ఏడాదికాలంగా రిలేషన్ లో ఉన్నట్లు ఆమెకు పెళ్లి తర్వాత కూడా ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నామని ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ తనంతట తానే తన రూమ్ కి వచ్చిందని, అందుకు సంబంధించిన వీడియోలు ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని సూసైడ్ నోట్ లో ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ విషయాలను ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా చెప్పానని ఈ విషయాలు తన ఐఫోన్ లో ఉన్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
అయితే మొదటగా ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలు ఫిర్యాదులు అవాస్తవమని తనకు చట్టంపై పూర్తిగా నమ్మకం ఉందని పెట్టారు. ఆ తర్వాత శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆత్మహత్యయత్నానికి ముందు రెండు పేజీల సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే అది అతడు రాసిన సూసైడ్ లేఖా..? అది ఎప్పుడు రాశారు..? అనేది పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :









