వైఎస్సార్ టీపీ లో 100 కుటుంబాలు చేరిక, గడపగడపకు వైఎస్సార్ టీపీ
వైఎస్సార్ టీపీ లో 100 కుటుంబాలు చేరిక,
గడపగడపకు వైఎస్సార్ టీపీ
హాలియా, జూన్ 16, మనసాక్షి: వైయస్సార్ తెలంగాణ పార్టీలో పెద్దవూర, తిరుమలగిరి మండలాలకు చెందిన 100 కుటుంబాలు చేరారు. గురువారం హాలియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నర్సిరెడ్డి సమక్షంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ వై ఎస్ ఆర్ టి పి నాయకులు స్వామి నాయక్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి నర్సిరెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు . ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలు వైఎస్సార్ టీపి ని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో లో రవి నాయక్, అశోక్ నాయక్ , లాలు నాయక్, బాలు నాయక్, శీను నాయక్, సుజాత, లలిత, వాలి , కమిలి , , దోలి, సైది ఉన్నారు.
గడపగడపకు వైయస్సార్ టిపి :
వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు వై ఎస్ ఆర్ సి పి ఈ కార్యక్రమాన్ని హాలియా పట్టణంలో నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇంజన్ నర్సిరెడ్డి గడపగడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిల్లుట్ల బ్రహ్మం, పెద్దవూర మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ నాయక్ , త్రిపురారం మండల పార్టీ అధ్యక్షులు ఎస్ కె ఖురాన్ , అనుముల మండలం అధ్యక్షులు అజయ్ కుమార్, అనంతుల కిరణ్, గోలి అమరయ్య, నడ్డి లింగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :
1. సికింద్రాబాదులో కాల్పులు, ఒకరి మృతి, పలువురికి గాయాలు
2. ఫ్లాష్.. ఫ్లాష్.. నల్గొండ జిల్లా లో రోడ్డు ప్రమాదం, 8 మందికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం










