Miryalaguda : సామ్యతండాలో గిరిజనుల తీజ్ పండుగ వేడుకలు..!
మిర్యాలగూడ మండలం సామ్య తండా లో ఆదివారం గిరిజనుల సాంప్రదాయ తీజ్ పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు.

Miryalaguda : సామ్యతండాలో గిరిజనుల తీజ్ పండుగ వేడుకలు..!
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలం సామ్య తండా లో ఆదివారం గిరిజనుల సాంప్రదాయ తీజ్ పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రధారణలో పాటలు, నృత్యాలతో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ అని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, కుటుంబ సౌభాగ్యం, సమాజ శ్రేయస్సు కోసం గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










