Suryapet : మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది కీలక ప్రకటన.. సూర్యాపేట అభివృద్ధే లక్ష్యం..!
సూర్యాపేట అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు.

Suryapet : మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది కీలక ప్రకటన.. సూర్యాపేట అభివృద్ధే లక్ష్యం..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో మురికి కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ నుంచి మంజూరైన రూ.5 లక్షల నిధులతో చేపడుతున్న ఈ పనుల ద్వారా స్థానికుల రాకపోకలు సులభతరం అవుతాయని ఆమె తెలిపారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే 9వార్డు నుంచి కొన్ని సమస్యలు వచ్చాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, స్థానిక కౌన్సిలర్ బండారు మంగమ్మ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు బంటు చోక్కయ్య, మన్నెం మల్లేష్, కోడి శివ, జానయ్య, వీరమల్ల రవి చరణ్, జవాను శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.









