Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsఉద్యోగం

మెగా డిఎస్సి కాదు.. దగా డీఎస్సీ.. లోకేష్ రాజీనామా చేయాలి..!

డీఎస్సీ–2025లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం మదనపల్లెలో భారీ ర్యాలీ నిర్వహించారు.

మెగా డిఎస్సి కాదు.. దగా డీఎస్సీ.. లోకేష్ రాజీనామా చేయాలి..!

అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

మహా ధర్నా లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్.

రామసముద్రం జులై 28, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ–2025లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం మదనపల్లెలో భారీ ర్యాలీ నిర్వహించారు.

మిషన్ కాంపౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కి వినతిపత్రాన్ని అందజేసి, డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలు, అక్రమాల ఆరోపణలపై స్వతంత్రంగా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన వంటి పథకాలను సకాలంలో అమలు చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా తంబళ్లపల్లె శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శాఖా మంత్రి లోకేశ్ డి ఎస్ సి సక్రమ నిర్వహణలో విఫలం చెందారని అక్రమాలకు ఆయనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని, విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం గా మారిందని ఆయన విమర్శించారు.

మదనపల్లె సమన్వయకర్త ఎస్ నిసార్ అహమద్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయ నియామకాలు లక్షలాది కుటుంబాల ఆశలకు సంబంధించిన విషయం. అలాంటి ప్రక్రియపై ప్రజల్లో, అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాల్సింది పోయి తప్పించుకునే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. డీఎస్సీ–2025లో జరిగిన ప్రతి అంశంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలను ప్రజల ముందుంచాలి. తప్పు చేయకపోతే విచారణకు భయపడాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు.

మదనపల్లె మాజీ శాసన సభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. “ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలి. యువత ఆశలను అణిచివేసే విధానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు” అని స్పష్టం చేశారు.

పరిశీలకురాలు అనీషా రెడ్డి మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి , విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిషోర్ , హేమంత్, మాజీ మునిసిపల్ చైర్మన్ వి. మనుజా రెడ్డి, పరిశీలకులు జింకా చలపతి, డి ఉదయ కుమార్, బాబ్జాన్ , ఎస్ ఈ సి సభ్యురాలు షమీమ్ అస్లాం, వై ఎస్ ఆర్ సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి ఎస్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శి కరీముల్లా, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్, కార్యదర్శి ఎస్ కె ఇర్ఫాన్, జడ్ పి టి సి సి హెచ్ రామచంద్రా రెడ్డి, నాయకులు సిబ్యాల విజయ భాస్కర్,వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు కేశవ రెడ్డి, ఎంపిపి వెంకట రమణా రెడ్డి, జయరామి రెడ్డి, స్టేట్ బిసి జనరల్ సెక్రటరీ గెవన్న,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి,

డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, డి. కరుణాకర్ రెడ్డి, కొండూరు కృష్ణా రెడ్డి,దర్శన్ గౌడ్,మైనారిటీ అధ్యక్షులు సందురి సర్దార్ బాషా,బిసి నాయకులు రెడ్డి వీరే గౌడ్, జవ హార్,నాగప్ప,చింతల మంజు కొమ్ము నారాయణ స్వామి, ఎంపిటీసీ మస్తాన్,యూత్ వింగ్ బాలాజీ, పాలు డైరీ విజయ్ అయ్యప్ప, శ్రీనివాసులు టపాల మస్తాన్,విద్యార్థి విభాగం అధ్యక్షుడు జంగం రెడ్డి కిషోర్ దాస్, విద్యార్థి విభాగం రాష్ట్ జాయింట్ సెక్రటరీ హేమంత్,విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర చక్రధర్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్ ,భువనేశ్వర్ రెడ్డి,ఫిరోజ్,విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ రాయల్ ,

గణేష్ ,విష్ణు చౌదరి, బాలాజీ, యోగానంద్, బబ్లూ, పీలేరు నియోజవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుల లోకనాథం, తంబళ్లపల్లి విద్యార్థి విభాగం సాయి చరణ్ రాజు,రాజంపేట విద్యార్థి విభాగం ఆఫ్రిద్… వెలుగు చంద్ర, , ఎన్ ఇర్ఫాన్ ఖాన్ , ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, కొత్తపల్లి నాగార్జున నాయుడు, శీలం రమేష్ , కొత్తపల్లి మహేశ్ , గ్రానైట్ మహేశ్ , నాగేంద్ర నాయక్, శంకర్ నాయక్, బీరంగి రేవతి , రేణుక, నక్కా రమాదేవి, పద్మజా రెడ్డి, శారదా రెడ్డి, శ్యామల, అపర్ణ,వినుతా బాయి, నాగమణి , ధనలక్ష్మి, మంజుల, అమ్మా జాన్ , బండపల్లి వెంకట రమణ, యూనస్ ,

అనిల్ కుమార్ రెడ్డి, నాగరాజ రెడ్డి, శరత్ రెడ్డి, వేమా రెడ్డి, రమణ, నరసింహులు , బాలాజీ, రెడ్డి వీరే గౌడ్, బొమ్మిశెట్టి మధు, చరణ్ , ఎన్ నవాజ్, షేక్ జబి, యాసిన్, ఈశ్వరయ్య, మాధవ రెడ్డి , ఆవుల సోమశేఖర్ రెడ్డి, సాంబశివా రెడ్డి, మజ్జిగ కేశవ యాదవ్, ఆవుల విశ్వనాథ్, చీకలబైలు చంద్ర, చలపతి, సత్తార్, ఫక్రుద్దీన్ , తాళే సుబ్రహ్మణ్యం, సమద్ , సాధిక్, షానవాజ్ మరియు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు