Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణ

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మిర్యాలగూడలో అరెస్ట్..!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మిర్యాలగూడలో అరెస్ట్..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాదులోని ఆయన నివాసాలకు వెళ్లిన పోలీసులు అక్కడ లేరని నిర్ధారించుకున్నారు.

కాగా అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్న విషయం తెలిసిందే. కాగా ఉదయ్ కృష్ణ రెడ్డి తాను పరారీలో లేనని సొంత గ్రామంలో ఉన్నట్లుగా వెల్లడించారు. కాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బంధువుల ఇంటిలో ఉండగా అతనిని అరెస్టు చేసినట్లు సమాచారం. బుధవారం కోర్టులో హాజరు పరిచనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు