Bonalu : యారోనిపల్లిలో బోనాల వేడుకలు..!
హన్వాడ మండలం యారోన్ పల్లి గ్రామంలో బుధవారం ఆషాడ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Bonalu : యారోనిపల్లిలో బోనాల వేడుకలు..!
హన్వాడ, మన సాక్షి:
మహబూబ్హ నగర్ జిల్లా హన్వాడ మండలం యారోన్ పల్లి గ్రామంలో బుధవారం ఆషాడ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరి మేళ తాళాలు, డప్పు నృత్యాల మధ్య అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శవకుల స్వాతి మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ ని నో ప్రభావంతో వర్షా బావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా మెంబర్ శవకుల తిరుపతయ్య, ఉప సర్పంచ్ మైబమ్మ, అంజలయ్య, మొగిలి రెడ్డి, బాలయ్య, రంగారెడ్డి, రాకమయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.









