బిఆర్ఎస్ లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు..!
బిఆర్ఎస్ లో మరో విషాదం నెలకొన్నది. ఆ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బిఆర్ఎస్ లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
బిఆర్ఎస్ లో మరో విషాదం నెలకొన్నది. ఆ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈనెల 26వ తేదీన హనుమకొండ హంటర్ రోడ్ లోని నివాసంలో ఆయన కార్థియాక్ అరెస్టుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర వైద్య చికిత్సలు అందించగా కొన్ని గంటలపాటు సిపిఆర్ చేశాక ఆయన స్పందించారు.
గుండె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్ ద్వారా హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యాధునిక వైద్య చికిత్స అందించారు. ఆధునిక వైద్యం అందించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు.
కార్డియాక్ అరెస్టుకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి యశోద ఆసుపత్రిలో అత్యధిక వైద్యం అందించారు. కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదించి ఆధునిక వైద్యం అందేలా చూశారు. ఆధునిక చికిత్స అందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి శరీరం రియాక్ట్ కాలేదని ఆసుపత్రి వ్యక్తులు తెలిపారు. చివరికి ఆయన మరణించినట్లు ధృవీకరించారు. శుక్రవారం ఉదయం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లనున్నారు.
తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో కీలకంగా పని చేసిన పెద్ది సురేష్ రెడ్డి 2001 నుంచి కేసీఆర్ తోనే ప్రయాణించారు. 1974 ఆగస్టు 6వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లబెల్లి గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మించారు. కష్టపడి ఆయన పైకి వచ్చారు. తొలిసారిగా జడ్పిటిసిగా విజయం సాధించారు. 2018 లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017లో పౌరసరఫరాల శాఖ చైర్మన్గా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.









